Wed Jan 21 2026 10:00:19 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తులో ప్రముఖ సీరియల్ నటి... అరెస్ట్
ప్రముఖ సీరియల్ నటి లహరిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో అరెస్ట్ చేశారు

ప్రముఖ సీరియల్ నటి లహరిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ఒక నేరమైతే.. ఆ మత్తులోనే ఆమె పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తికి యాక్సిడెంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనాన్ని నడిపే వ్యక్తి తన విధులు ముగించుకుని శంషాబాద్ వైపుగా వస్తున్నాడు. అదే సమయంలో అటువైపుగా కారులో వస్తున్న లహరి అతడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
అరెస్ట్ చేసి.....
ఇంత జరిగినా లహరి మాత్రం కారులోంచి బయటకు దిగి రాకపోడంతో.. వాహనదారులు ఆమెపై మండిపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు లహరిని అరెస్ట్ చేసి, ఆమె కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాద ఘటనపై బాధిత కుటుంబం ఇంకా ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- lahari
- tv actress
Next Story

