Sat Mar 07 2026 18:02:12 GMT+0530 (India Standard Time)
Telangana : ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు

నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. భారీ వర్షాలతో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు మండలం వనపట్లలో ఉన్న మట్టి ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న నలుగురు మరణించారు. మృతులు గొడుగు పద్మ, పప్పి, వసంత, విక్కి మరణించారని పోలీసులు తెలిపారు.
భారీ వర్షాలకు...
పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే నిన్న కురిసిన భారీ వర్షం కారణంగానే ఇల్లు కూలడంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story

