Wed Apr 15 2026 14:47:25 GMT+0530 (India Standard Time)
ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్‌లో ఒక యువతి రీల్స్ పిచ్చిప్రాణం తీసింది. ఇటీవల కాలంలో యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తాము హైలెట్ కావాలని భావిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఆ ప్రయత్నాలు ప్రాణం మీదకు తెస్తున్నాయి. ఘజియాబాద్ కు చెందిన యువతి కూడా ఈ రీల్స్ పిచ్చి తోనే ప్రాణాలను తీసుకుంది.
బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ...
బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ రీల్ షూట్ చేస్తుండగా బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవ్ చేస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. రీల్ షూట్ చేస్తున్న యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయాలపాలయిన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చివరి క్షణాల్లో షూట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.
Next Story

