Thu Mar 19 2026 08:52:39 GMT+0530 (India Standard Time)
విశాఖలో విషాదం : ముగ్గురి మృతి
విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. పాత మూడు అంతస్థుల భవనం కూలి ముగ్గురు మరణించారు

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. పాత మూడు అంతస్థుల భవనం కూలి ముగ్గురు మరణించారు. విశాఖపట్నంలోని రామజోగిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయ. వారిని వెంటనే కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిని...
గాయపడిన వారు ఐదుగురు వరకూ ఉన్నారు. అయితే గాయపడిన వారి పరిస్థితి పరవాలేదని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. తెల్లవారు జామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు.
Next Story

