Sat Mar 14 2026 18:06:47 GMT+0530 (India Standard Time)
సెల్ఫోన్ పేలి నలుగురు చిన్నారుల సజీవ దహనం
ఉత్తర్ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు

ఉత్తర్ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఉత్తర్ప్రదేశ్ లోని మీరటర్ జిల్లా పల్లవ్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పిల్లలు నలుగురు సజీవ దహనమయ్యారు. మోదిపురం జనతా కాలనీలో ఓ ఇంట్లో భార్యాభర్తలు, నలుగురు పిల్లలు నివాసముంటున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణమంటూ...
అయితే సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా అది పేలి మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు గాయపడగా, చిన్నారులు నలుగురు మరణించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ కాలనీ విషాదం నింపింది. సెల్ఫోన్ ప్రాణం తీసిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తల్లిదండ్రులు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story

