Fri Apr 25 2025 09:44:36 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సిద్ధిపేట కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య.. భార్య పిల్లలను చంపేసి
సిద్ధిపేటలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట కలెక్టర్ గన్ మెన్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నారు.

సిద్ధిపేటలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట కలెక్టర్ గన్ మెన్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య పిల్లలను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో పాటు తన ఇద్దరి పిల్లలను చంపేశాడు. చిన్న కోడూరు మండలం రామునిపట్నంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆత్మహత్యకు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి...
కుటుంబంలో నెలకొన్న విభేదాలు కారణమని పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. భార్య పిల్లలను చంపేసి తర్వాత తాను గన్ తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ మెన్ నరేష్ మృతదేహంతో పాటు భార్య, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈరజు విధులకు రాకపోవడంతో హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమని భావిస్తున్నారు.
Next Story