Wed Jan 21 2026 16:28:12 GMT+0000 (Coordinated Universal Time)
చపాతీ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి
సికింద్రాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఒక విద్యార్థి మరణించాడు

సికింద్రాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఒక విద్యార్థి మరణించాడు. దీంతో పాఠశాల యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లో ఉన్న ఒక పాఠశాలలో విరన్ జైన్ అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. చపాతీ రోల్ తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడలేదు.
ఆసుపత్రికి తరలిస్తుండగా...
వెంటనే ప్రయివేటు స్కూల్ యాజమాన్యం విద్యార్థిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే మార్గమధ్యంలోనే విద్యార్థి ప్రాణాలు విడిచాడు. దీంతో పోస్టు మార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

