Wed Jan 28 2026 23:50:38 GMT+0000 (Coordinated Universal Time)
విహారయాత్రలో విషాదం.. ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థుల గల్లంతు
ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో విషాదం జరిగింది. జలపాతంలో చిక్కుకుని ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతయ్యారు

ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో విషాదం జరిగింది. జలపాతంలో చిక్కుకుని ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతయ్యారు. వీకెండ్ ఆనందంగా గడుపుదామని మారేడుమిల్లికి వచ్చి అక్కడ జలపాతంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగి అందులో కొట్టుకుపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈ ఘటన జరిగింది.
మారేడుమిల్లికి వచ్చి...
మారేడుమిల్లికి నిన్న ఆదివారం పథ్నాలుగుమంది వైద్య విద్యార్తులు టెంపో ట్రావెలర్ వాహనంలో వచ్చారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జలపాతంలో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరంతా ఎంబీబీఎస్ చదువుతున్న వారే. గల్లంతయిన వారిలో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రిపుష్పలను కాపాడగలిగారు.అయితే ప్రకాశం జిల్లాకు చెందిన హరదీప్, విజయనగరానికి చెందిన సౌమ్య, బాపట్లకు చెందిన అమృత మాత్రం గల్లంతయ్యారు.గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు.
Next Story

