Thu Jan 22 2026 04:02:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏనుగుల దాడిలో మృతి
కుప్పం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. మల్లానూరు పంచాయతి లో ఏనుగులు దాడిలో ఒక మహిళ మృతి చెందింది

కుప్పం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. మల్లానూరు పంచాయతి లో ఏనుగులు దాడిలో ఒక మహిళ మృతి చెందింది. పర్తిచేను గ్రామానికి, చెందిన ఉషా రోజు రైల్లో మల్లానూరు నుండి బెంగళూరుకు పనికి వెళుతుంది. ఎప్పటిలాగానే రైలు ఎక్కేందుకు గ్రామం నుండి తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళ్లింది.
తొక్కిచంపేసి...
అయితే రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో ఏనుగులు దాడి చేయడంతో ఇద్ధరు మహిళలు గాయాల తో తప్పించుకున్నారు. ఉష అనే మహిళ ఏనుగులుదాడిలో మరణించింది. ఉషకు ముగ్గురు పిల్లలు, భర్త చనిపోయాడు. రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.
Next Story

