Sun Mar 15 2026 18:55:46 GMT+0530 (India Standard Time)
అన్న మృతి తెలిసి తమ్ముడు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో?
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ఒకే రోజు మృతి చెందడం బాధాకరం

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ఒకే రోజు మృతి చెందడం బాధాకరం. దీంతో బంధువులు, సన్నిహితులు ఇద్దరి మరణవార్త విని బోరుమంటును్నారు. కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై నరేంద్ర కుమార్ అనే యువకుడు మృతి చెందాడు.
శంషాబాద్ సమీపంలో...
అన్న మరణవార్త తెలుసుకున్న తమ్ముడు రాజేష్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరాడు. అయితే రాజేష్ శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరూ ఒకే రోజు మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

