Sun Mar 08 2026 06:31:27 GMT+0530 (India Standard Time)
Breaking : కడపలో విషాదం.. తుపాకీతో భార్య బిడ్డలను కాల్చి
కడపలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ తన కుటుంబ సభ్యులను కాల్చి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు

కడపలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ తన కుటుంబ సభ్యులను కాల్చి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొద్దిసేపటి క్రితం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చిన కానిస్టేబుల్ తర్వాత తనకు తాను కాల్చుకున్నాడు. కడప టూ టౌన్ లో కానిస్టేబుల్ గా అతను పనిచేస్తున్నారు.
తనకు తాను ఆత్మహత్య...
కడప టూ టౌన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఈరోజు ఉదయం తన భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలో విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

