Fri Mar 20 2026 06:18:56 GMT+0530 (India Standard Time)
పడవ బోల్తా .. ఆరుగురు మహిళల గల్లంతు
గడ్చిరోలి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైనగంగా నదిలో పడవ బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మహిళలు గల్లంతయ్యారు

గడ్చిరోలి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైనగంగా నదిలో పడవ బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మహిళలు గల్లంతుయినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో ఎంత మంది పడవలో ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
కారణమేంటి?
గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎందుకు ప్రమాదం జరిగింది? సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఎక్కించుకోవడం వల్లనే పడవ బోల్తా కొట్టిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

