Thu Mar 19 2026 15:35:14 GMT+0530 (India Standard Time)
ఫ్లెక్సీలు కడుతుండగా.. విద్యుత్ షాక్.. నలుగురు యువకుల మృతి
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు కడుతుండగా నలుగురు యువకులు మరణించిన ఘటన జరిగింది

తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు కడుతుండగా నలుగురు యువకులు మరణించిన ఘటన జరిగింది. సర్దార్ పాపన్న రాయుడు విగ్రహావిష్కరణ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు నేడు ముహూర్తాన్ని నిర్ణయించారు. దీంతో విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఫ్లెక్సీలను కట్టేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు.
కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి...
అయితే వారికి ఆ సమయంలో కరెంట్ షాక్ తగిలింది. దీంతో మృతులు బొల్లా వీర్రాజు, కాశగాని కృష్ణ, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ స్పాట్ లోనే చనిపోయారు. అయినా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకులు మరణించారని వైద్యులు తెలిపారు. నలుగురి మృతిపట్ల మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story

