Mon Mar 23 2026 08:58:58 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో విషాదం.. నిద్రిస్తున్న వారిపై ట్రక్కు వెళ్లడంతో?
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఢిల్లీలోని సీమపురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డివైడర్ పై నిద్రిస్తున్న వారి పైకి ఒక ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించగా, ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు తెలిపారు.
మృతులు వీరే....
ఈ ప్రమాదంలో మరణించిన మృతులను గుర్తించారు. కరీమ్, ఛోటే ఖాన్, షా ఆలమ్, రాహుల్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మనీష్, ప్రదీప్ లు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

