Mon Mar 16 2026 12:22:33 GMT+0530 (India Standard Time)
విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీటీ కుంటలో పడి మరణించారు

బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీటీ కుంటలో పడి మరణించారు. బీహార్ రాష్ట్రంలోని మఝలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నీటి కుంటలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
నీటి కుంటలో పడి...
బహువార్వా గ్రామానికి చెందని ఈశ్వరి దేవి, సరిత, ఖుషికుమారి, హంసిలు ఈ ఘటనలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story

