Fri Dec 05 2025 13:34:49 GMT+0000 (Coordinated Universal Time)
అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఐదుగురు గల్లంతు
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పూడికమడిక సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పూడికమడిక సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. వీరంతా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది. పదిహేను మంది ఇంజినీరింగ్ విద్యార్థులు స్నానాల కోసం పూడిమడిక సముద్ర తీరానికి వచ్చారు. అయితే అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో పదిహేను మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో పది మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఒకరి మృతేదహాన్ని....
మరో ఐదుగురు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఒక మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంజనీరింగ్ విద్యార్థులంతా కలసి సరదాగా స్నానాలకు వచ్చి ఈ ప్రమాదం బారినపడ్డారు. కళాశాల యాజమాన్యం అనుమతి లేకుండా స్నానాలకు వచ్చి ఈ ప్రమాదానికి లోనయ్యారని తెలుస్తోంది. కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు గజఈతగాళ్లతో సముద్రతీరంలో గల్లంతయిన వారికోసం గాలిస్తున్నారు.
Next Story

