Fri Dec 05 2025 15:41:59 GMT+0000 (Coordinated Universal Time)
అల్లూరి జిల్లాలో విషాదం.. తాహసిల్దార్ బలవన్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తహసిల్దార్ బలవన్మరణానికి ఆయన పాల్పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తహసిల్దార్ బలవన్మరణానికి ఆయన పాల్పడ్డారు. జిల్లాలోని పెదబయలు మండలం తహసిల్దార్ శ్రీనివాసరావు మృతితో విషాదం అలుముకుంది. ఈరోజు ఉదయం విధులు నిర్వహించడానికి కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు అటెండర్ ను టిఫిన్ తీసుకురావాలని పురమాయించారు. అటెండర్ టిఫిన్ కోసం బయటకు వెళ్లాడు.
టిఫిన్ తీసుకొచ్చేలోగా...
అటెండర్ టిఫిన్ తీసుకుని వచ్చి శ్రీనివాసరావు కోసం చూడగా ఆయన కనపించలేదు. పక్కనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆందోళనలతో కేకలు వేసి సిబ్బందిని పిలిచి చూసేలోగా ఆయన మృతి చెందాడు. తహసిల్దార్ మృతి కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వృత్తి పరమైన చికాకులా? కుటుంబ పరమైన సమస్యలా? అన్నది తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు.
Next Story

