Mon Mar 16 2026 11:20:50 GMT+0530 (India Standard Time)
కోలాటం ఆడుతూ గుండెపోటుతో మృతి
సంక్రాంతి వేళ విషాదం చోటు చేసుకుంది. కోలాటం ఆడుతూ ఒక మహిళ కుప్పకూలి మరణించింది.

సంక్రాంతి వేళ విషాదం చోటు చేసుకుంది. కోలాటం ఆడుతూ ఒక మహిళ కుప్పకూలి మరణించింది. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన సంక్రాంతి రోజున కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో జరిగింది. పండగ రోజు గ్రామంలోని యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలతో పాటు కోలాటం కూడా నిర్వహించారు.
ఆసుపత్రికి తరలించేలోగా...
అయితే కోలాటం ఆడుతున్న ఒక మహిళ ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడి యువకులు కొందరు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె గుండెపోటు మరణిచినట్లు వైద్యులు చెప్పడంతో గ్రామంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది. కోలాటం ఆడుతూ కుప్పకూలిన మహిళ వీడియోను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.
Next Story

