Fri Dec 05 2025 09:34:58 GMT+0000 (Coordinated Universal Time)
Road Accdent :ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది స్పాట్ డెడ్
పశ్చిమ బెంగాల్ లో విషాదం నెలకొంది. పురులియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు

పశ్చిమ బెంగాల్ లో విషాదం నెలకొంది. పురులియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈరోజు ఉదయం నమ్షోల్ వద్ద బాలారంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 18పై ఈ ఘటన జరిగింది. లారీని బొలెరో వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అడబానా గ్రామం నుంచి జార్ఖండ్ లోని తిలైతాండ్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢొకట్టింది.
వివాహానికి హాజరయి వస్తుండగా...
వీరంతా ఒక వివాహానికి హాజరయి వస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
Next Story

