Fri Dec 05 2025 11:23:07 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కర్నూలు జిల్లాలో విషాదం..నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఆస్పిరి మండలం చిగిలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పక్కనే ఉన్న నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి కుంటలోకి భారీగా నీరు చేరింది.
ఈతకు వెళ్లి...
ఈ సమయంలో ఈతకు వెళ్లిన విద్యార్థులు ఆరుగురు నీటికుంటలో పడి మరణించారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా మారడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు అటు వైపు వెళ్లకుండా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పట్టించుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

