Sat Dec 06 2025 00:56:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ వాడొద్దని తల్లిదండ్రలు తిట్టారని
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వెంకటాపురానికి చెందిన 12 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఆ బాలుడు ప్రైవేట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాడు. మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు.
ఖాళీ సమయాల్లో మాత్రమే...
ఖాళీ సమయాల్లో మాత్రమే వాడుకోవాలని తండ్రి హెచ్చరించడంతో బాధపడిన బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ఎమ్మిగనూరు టౌన్ పోలీసులకు సమాచారం అందినా, తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని వారు తెలిపారు. కానీ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

