Mon Feb 02 2026 18:06:48 GMT+0000 (Coordinated Universal Time)
వంతెన కూలి కాల్వలోకి వాహనం... ముగ్గురి మృతి
అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. మల్లికేతి హెచ్ఎల్సీ కాల్వ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది

అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. మల్లికేతి హెచ్ఎల్సీ కాల్వ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం కాల్వలో కొట్టకు పోయింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళ కూలీలు మృతి చెందారు. కూలీలు ప్రయాణిస్తున్న వాహనం వంతెన కూలిపోవడంతో అదుపుతప్పి కాల్వలోకి పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ముగ్గురి కోసం....
అయితే బొలేరో వాహనం కాల్వలో కొట్టుకుపోవడంతో గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. కాలవ దాటుతుండగా బ్రిడ్జి కూలిపోయి ఈ ఘటన జరిగింది. బొమన్మహళ్ మండల్ ఉద్దేజ్ వద్ద ఈ ఘటన జరిగింది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Next Story

