Mon Mar 16 2026 02:49:50 GMT+0530 (India Standard Time)
ఎయిర్ గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో వావిలాలో విషాదం నెలకొంది. ఎయిర్ గన్ పేలి బాలిక మృతి చెందింది

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో వావిలాలో విషాదం నెలకొంది. ఎయిర్ గన్ పేలి బాలిక మృతి చెందింది. ఓ ఫాంహౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు ఎయిర్ గన్ తో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఫాంహౌస్ లో.....
కాగా ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫాంహౌస్ యజమానిపై కేసు నమోదు చేసే అవకాశముంది. ఎయిర్ గన్ ను పిల్లలకు అందుబాటులో ఉంచడం తీవ్ర నేరంగా పరిగణించాల్సి ఉంటుందని పోలీసుు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

