Wed Mar 18 2026 19:13:59 GMT+0530 (India Standard Time)
కోడి దాడిలో యువకుడి మృతి
చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఊహించని ఘటనకు ఒక యువకుడు బలయ్యాడు

చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఊహించని ఘటనకు ఒక యువకుడు బలయ్యాడు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది. దశదిన కర్మ సందర్భంగా కోడిపందేలను నిర్వహించారు. కోడి పందేలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తరలి వచ్చారు.
పందేలు నిర్వహిస్తుండగా...
అయితే కోడి పందేలు నిర్వహిస్తుండగా కోడి ఒక యువకుడిపై దాడి చేసింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. పందేలు చూస్తుండగా కోడి దాడిచేయడంతో కత్తి తగిలి యువకుడు మరణించాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

