Fri Sep 13 2024 02:16:41 GMT+0000 (Coordinated Universal Time)
పండగ పూట విషాదం... రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తాడేపల్లి గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున చేపల లోడ్ తో వెళుతున్న లారీ అదుపు తప్పింది. అదుపు తప్పిన లారీ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృలలి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
అందరూ కూలీలే...
చేపల లోడ్ తో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story