Tue Jan 20 2026 17:58:05 GMT+0000 (Coordinated Universal Time)
అపార్ట్ మెంట్ పై నుండి పడి మెడికల్ విద్యార్థి మృతి
బి4 బ్లాక్ నుండి పడటంతో గిరితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు..

విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండాడలోని వైశాఖి స్కైలైన్ లో ఓ మెడికల్ విద్యార్థి అపార్ట్ మెంట్ పై నుండి పడి మృతి చెందాడు. మృతుడు ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గోగినేని గిరితేజగా గుర్తించారు. బి4 బ్లాక్ నుండి పడటంతో గిరితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గిరితేజ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతుడు సీతమ్మధార వాసిగా గుర్తించారు. గిరితేజ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.
మైలవరం జలాశయంలోకి దూకి..
సోమవారం ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం వద్ద విషాదం చోటుచేసుకుంది. వేపరాల గ్రామానికి చెందిన గోవర్థన్, దేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహాల కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని గోవర్థన్ బంధువులు తెలిపారు.
Next Story

