Fri Dec 05 2025 08:14:33 GMT+0000 (Coordinated Universal Time)
కల్తీ మద్యం తాగి పథ్నాలుగు మంది మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం
పంజాబ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి పథ్నాలుగు మంది మరణించారు

పంజాబ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి పథ్నాలుగు మంది మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి అమృతసర్ జిల్లాలోని మజీఠా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి వరస మరణాలు సంభవించడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆసుపత్రికి తరలించారు.
అమృత్ సర్ జిల్లాలోని...
ఈ మేరకు ఎస్ఎస్ పి మనీందర్ సింగ్ మీడియాకు తెలిపారు. కల్తీ మద్యం తాగి పెద్ద సంఖ్యలో చనిపోతుందని తెలిసిన వెంటనే తాము అక్కడకు చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరబ్జీత్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఈ మద్యాన్ని సహబ్ సింగ్ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. కల్తీ మద్యం సరఫరా దారులపై విచారణ చేపట్టామని మనీందర్ సింగ్ తెలిపారు.
Next Story

