Tue Apr 29 2025 09:01:37 GMT+0000 (Coordinated Universal Time)
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు

అన్నమయ్య జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. రాజుదేవా, రాజు జయ, యశ్వంత్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులో ఉన్న కుంటలో పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.
ఆడుకుంటూ వెళ్లి...
ఆడుకుంటూ వెళ్లిన పిల్లలు తమకు తెలియకుండానే నీటి కుంటలో పడి మరణిచండంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలు కనిపించక ఊరంతా వెతికిన కుటుంబ సభ్యులకు చివరకు నీటి కుంటలో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story