Mon Jun 23 2025 03:20:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు
తెలంగాణలో ఘోర విషాదం జరిగింది. గోదావరి నదిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.

తెలంగాణలో ఘోర విషాదం జరిగింది. గోదావరి నదిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. జయంశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ మండలం అంబట్ పల్లి వద్ద ఈ ఘటన జరిగింది. గల్లంతయిన ఆరుగురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం తో పాటు గజ ఈతగాళ్లను రప్పించి మరీ గల్లంతయిన వారి కోసం గోదావరి నదిలో వెతుకుతున్నారు.
గాలింపు చర్యలు...
నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినా నదిలో ప్రవాహం అధికంగా ఉండటంతో పాటు రాత్రి వేళ లైట్లు లేకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగలేదు. ఈరోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండు స్పీడ్ బోట్లతో పాటు ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక కేంద్రం బృందాలు గాలింపు చర్యలు జరుపుతున్నాయి. గల్లంతయిన వారి కోసం వెదుకులాట ప్రారంభమయింది. అయితే ఇంత వరకూ జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.
Next Story