Mon Feb 02 2026 05:04:35 GMT+0000 (Coordinated Universal Time)
21 నెమళ్లు మృతి.. కారణం అతడే
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఎలుకల మందు తిని 21 నెమళ్లు మృతి చెందాయి

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఎలుకల మందు తిని 21 నెమళ్లు మృతి చెందాయి. తన పొలంలో ఎలుకలు రాకుండా రైతు మందు పెట్టారు. ఆ మందు తిని నెమళ్లు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తమిళనాడులోని తిరుపత్తూరు సమీనంలోని కురమ్ పత్తి గ్రామానికి చెందిన షణ్ముగం అనే రైతు తన పొలంలో వరి వేశాడు.
ఎలుకల మందు...
అయితే ఎలుకలు ఎక్కువగా వస్తుండటంతో వాటిని చంపేందుకు ఎలుకల మందు పొలంలో పెట్టాడు. రాత్రిపూట పొలానికి వచ్చిన నెమళ్లు ఆ మందును తినేశాయి. వెంటనే మరణించాయి. ఎలుకల మందు కారణంగానే మరణించాయని తెలియడంతో అటవీ శాఖ అధికారులు రైతు షణ్ముగంను అరెస్ట్ చేశారు.
Next Story

