Sun Dec 14 2025 01:50:47 GMT+0000 (Coordinated Universal Time)
మునిగిపోయిన యుద్ధ నౌక
థాయ్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. జలసంధిలో గస్తీ నిర్వహిస్తున్న యుద్ధనౌక మునిగిపోయింది

థాయ్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. జలసంధిలో గస్తీ నిర్వహిస్తున్న యుద్ధనౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 31 మంది నావికులు గల్లంతయ్యారు. నౌకలో ఉన్న సైనికల్లో సహాయక సిబ్బంది 75 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్ర గాలులు, పది అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడటంతోనే యుద్ధనౌక మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు.
75 మందిని కాపాడి...
గల్లంతయిన సైనికుల కోసం హెలిక్టాప్టర్ ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పరచుయాప్ ఖిరిఖాన్ ప్రావిన్స్ లోని బాంగ్సఫాన్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో గస్తీ నిర్వహిస్తున్న సుఖోదోయ్ యుద్ధనౌక మునిగిపోయింది. నౌకలోకి సముద్ర అలలు చేరడంతోనే మునిగిపోయినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Next Story

