Mon Feb 02 2026 02:00:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్రిడ్జ్ పేలి ముగ్గురి మృతి
తమిళనాడులో విషాదం జరిగింది. ఫ్రిడ్జి పేలి ఒకే కుటుబంలోని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు

తమిళనాడులో విషాదం జరిగింది. ఫ్రిడ్జి పేలి ఒకే కుటుబంలోని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని కోదండరామ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఫ్రిడ్జి పేలింది. ఈ ప్రమాదంలో గిరిజ, రాధ, రాజ్ కుమార్ లు మృతి చెందారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు...
మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్రిడ్జి పేలి కుటుంబ సభ్యులు ముగ్గురు మరణించడంతో కోదండరామ్ నగర్ లో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

