Fri Dec 05 2025 18:26:16 GMT+0000 (Coordinated Universal Time)
బాణా సంచాపై కూర్చుని..యువకుడు ఏం చేశాడంటే?
కర్ణాటక రాష్ట్రంలో విషాదం జరిగింది. ఒక యువకుడి ప్రాణాన్ని బెట్టింగ్ బలిగొంది

కర్ణాటక రాష్ట్రంలో విషాదం జరిగింది. ఒక యువకుడి ప్రాణాన్ని బెట్టింగ్ బలిగొంది. బాణాసంచా మీద కూర్చుని పేల్చుకుంటే ఆటో ఉచితంగా ఇస్తామని కొందరు వేసిన బెట్టింగ్ కు ఒక యువకుడు బలయ్యాడు. దీపావళి పండగ రోజు ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని కొననకుంటలో ఈ ఘటన జరిగింది.
పేలుడు దాటికి మృతి...
శబరీష్ అనే యువకుడు తన స్నేహితులతో బెట్టింగ్ కాసాడు. బాణాసంచా మీద కూర్చుని కాల్చుకుంటే ఆటోను ఉచితంగా ఇస్తామని బెట్టింగ్ కాశారు. దీంతో శబరీష్ అనే యువకుడు బాణాసంచా మీద కూర్చుని నిప్పంటించాడు. అయితే అది ఒక్కసారిగా పేలడంతో శబరీష్ అక్కడికక్కడే పడి పోయారు. వెంటనే స్నేహితులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా శబరీష్ మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో బెట్టింగ్ ఒక యువకుడు ప్రాణాలు బలిగొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story

