Fri Dec 05 2025 17:45:01 GMT+0000 (Coordinated Universal Time)
జనగామ టౌన్ ఎస్ఐ ఇంట విషాదం
జనగామ టౌన్లో విషాదం అలుముకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య బలవన్మరణం పొందారు

జనగామ టౌన్లో విషాదం అలుముకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య బలవన్మరణం పొందారు. భార్య, భర్తల మధ్య కొద్ది కాలంగా మనస్పర్థలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. నిన్న రాత్రి కూడా శ్రీనివాస్ భార్యతో గొడవపడ్డారని అంటున్నారు. దీంతోనే శ్రీనివాస్ భార్య బాత్ రూంలో ఉరేసుకుని మరణించింది.
సర్వీస్ రివాల్వర్‌తో...
ఇది చూసిన ఎస్ఐ శ్రీనివాస్ మనస్థాపానికి గురయ్యారు. భార్య మరణించడంతో తను కూడా బతకడం వృధా అని భావించి ఎస్ఐ శ్రీనివాస్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- si srinivas
- wife
Next Story

