Tue Jan 20 2026 23:14:04 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణానదిలో మునిగి ఇద్దరు మృతి
అమరావతి మండలం దిడుగు కృష్ణానది వద్ద విషాదం నెలకొంది. నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతయ్యారు.

అమరావతి మండలం దిడుగు కృష్ణానది వద్ద విషాదం నెలకొంది. నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో స్థానికులు ముగ్గురిని కాపాడారు.మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. .అమరావతి మండలం లింగాపురం కు చెందిన కంభంపాటి సందీప్, మంగళగిరి కి చెందిన ధనుష్16 మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వరద ఉధృతి ఎక్కువగా...
పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రమాదరకమైన పరిస్థితుల్లో నదీస్నానానికి దిగవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ఘాట్లలో మాత్రమే నదీ స్నానం ఆచరించాలని పోలీసులు పేర్కొంటున్నారు. లేకుంటే ఇటువంటి ఘటనలు జరుగుతాయని చెబుతున్నారు.
Next Story

