Thu Mar 19 2026 07:20:24 GMT+0530 (India Standard Time)
పెళ్లి వేడుకల్లో విషాదం : ఐదుగురి మృతి
రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జరుగుతున్న పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు మరణించారు

రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జరుగుతున్న పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జోధ్‌పూర్ జిల్లా భూంగ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఐదు గ్యాస్ సిలెండర్లు పేలడంతో ఈ ప్రమాదం జిగింది. దాదాపు అరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని...
మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారందరినీ జోథ్‌పూర్ లోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

