Fri Dec 05 2025 22:39:51 GMT+0000 (Coordinated Universal Time)
అధికారులు మోసం చేశారంటూ కుటుంబం బలవన్మనరణం
కడప జిల్లాలోని ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

కడప జిల్లాలోని ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఈ ఘటన జరిగింది. చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న సుబ్బారావు, తన భార్య పద్మావతి, కుమార్తె వినయలు కలసి బలవన్మరణానికి పాల్పడ్డారు. సుబ్బారావు రైలు కింద పడి మరణించగా, మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులు ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు.
రెవెన్యూ అధికారులు...
అయితే రెవెన్యూ అధికారులు మోసం చేసిన కారణంగానే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబానికి చెందిన మూడు ఎకరాల పొలాన్ని రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చి వేరొకరికి కట్టబెట్టారంటూ లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

