Sun Mar 22 2026 17:29:56 GMT+0530 (India Standard Time)
ఘోర ప్రమాదం.. 6గురు మృతి, 20 మందికి గాయాలు
మృతుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మరణించారు.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం నెలకొంది. ట్రాక్టర్ పంటకాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మరణించారు. ప్రమాదంలో గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

