Fri Mar 20 2026 03:03:25 GMT+0530 (India Standard Time)
Breaking : నల్లమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు

నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. అనేక మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాళ్లు, చేతులు విరిగి..
పదిమందికి కాళ్లు, చేతులు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఘాట్రోడ్డులో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. కొత్తగూడెం నుంచి శ్రీశైలం బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story

