Mon Dec 09 2024 07:04:37 GMT+0000 (Coordinated Universal Time)
మావోయిస్టు అగ్రనేత మృతి
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ మే 31న గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. కటకం సుదర్శన్..
సీపీఐ మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆదివారం ఉదయం మీడియా ద్వారా ప్రకటించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ మే 31న గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప సభలను నిర్వహించనున్నట్లు తెలిపింది. కటకం సుదర్శన్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి.
వరంగల్ లో పాలిటెక్నిక్ చదివిన ఆయన.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దోపిడీకి గురవుతున్న ఆదివాసీల హక్కుల కోసం పోరాడేందుకు నక్సల్లో జాయిన్ అయ్యాడు. 1978లో సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2011 నవంబర్ లో కిషన్ జీ ని హతమార్చిన తర్వాత 14 మంది సభ్యులతో పొలిటికల్ బ్యూరోకు నాయకుడిగా వ్యవహరించారు. ఏపీ, తెలంగాణ నక్సల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీలోనే సాధన అనే మహిళను వివాహం చేసుకోగా.. గత కొంతకాలం క్రితం నిర్వహించిన ఎన్కౌంటర్లో ఆమె మరణించారు. 2011 చత్తీస్ఘడ్లోని దంతేవాడ మారణకాండలో ప్రధాన సూత్రదారిగా ఉన్న సుదర్శన్పై 21 కేసులు నమోదయ్యాయి.
Next Story