Thu Dec 18 2025 10:17:22 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్ఛామి సినిమాలకు హాథిరామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలా సినీ నటులతో పరిచయం ఏర్పడటంతో..

హైదరాబాద్ ను డ్రగ్స్ వ్యవహారాలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి డ్రగ్స్ అంశం నగరంలో కలకలం రేపింది. సినీ ఆర్టిస్టులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఏకంగా 190 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్ఛామి సినిమాలకు హాథిరామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలా సినీ నటులతో పరిచయం ఏర్పడటంతో వారికి మత్తుపదార్థాలను.. ముఖ్యంగా గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. కర్ణాటక నుంచి కారులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని, హాథిరామ్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తప్పించుకున్నాడని పేర్కొన్నారు.
Next Story

