Sat Mar 07 2026 21:54:07 GMT+0530 (India Standard Time)
Breaking : జానీ మాస్టర్ అరెస్ట్
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఆయన ప్రస్తుతం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. జానీ మాస్టర్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆయనను హైదరాబాద్ కు తరలించనున్నారు.
లైంగిక వేధింపుల కేసులు...
ఒక మహిళ కొరియాగ్రఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. ఆయన కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు జానీ మాస్టర్ బాధితురాలికి భద్రతను కల్పిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
Next Story

