Tue Jan 20 2026 21:58:58 GMT+0000 (Coordinated Universal Time)
Jony Master : హైదారాబాద్ చేరుకున్న జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. మరికాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. ఆయనను మరికాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు. నిన్న గోవాలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడ కోర్టులో హాజరు పర్చి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు కూడా నమోదయింది.
రహస్య ప్రదేశంలో...
జానీ మాస్టర్ ను ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. మహిళ కొరియాగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై ఈ కేసులు నమోదయ్యాయి. జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా నమోదవుకావడంతో పాటు అత్యాచారం కేసు ను కూడా పెట్టారు. దీంతో నేడు కోర్టులో హాజరుపర్చి ఆయనను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి కోరే అవకాశముంది.
Next Story

