Sat Dec 06 2025 04:24:03 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ నటి ఇంటిలో విషాదం
టాలీవుడ్ నటి సోహని కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

టాలీవుడ్ నటి సోహని కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉరితీయగా, ఈ ఘటన 27న రాత్రి జరిగినప్పటికీ సోమవారం వెలుగులోకి వచ్చింది. సవాయి ఆత్మహత్యకు ముందు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పెట్టాడు. అందులో తన జీవితంలో చాలా తప్పులు చేశానని. ఇకపై అలాంటి తప్పులు చేయనని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.
ఆర్థిక సమస్యలే కారణమని...
జూబ్లీహిల్స్ పోలీసుల సమాచారం ప్రకారం.. సోహని కుమారి, సవాయి సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. స్నేహం ప్రేమగా మారింది. మేలో సోహని హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్, రోడ్ నెం.6, ప్లాట్ నెం.37లో నివాసం ఉంటోంది.ఈ నెల 27వ తేదీన ఉదయం ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. అనంతరం సోహని తన పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి సవాయి ఉరివేసుకున్నాడు. సోహని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సవాయి, తన మాజీ స్నేహితురాలితో ఉన్న ఆర్థిక లావాదేవీలే ఆత్మహత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . పోలీసులు క్లూస్ బృందంతో సాక్ష్యాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Next Story

