Sun Feb 01 2026 14:17:08 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
గ్రావెల్ లోడుతో వచ్చిన టిప్పర్ ఆలయాన్ని ఢీ కొట్టడంతో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం నుండి..

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వినాయకగుడి లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రావెల్ లోడుతో వచ్చిన టిప్పర్ ఆలయాన్ని ఢీ కొట్టడంతో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపుగా వెళ్తున్న టిప్పర్ లారీ ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును అతివేగంగా ఢీ కొట్టి.. పక్కనే ఉన్న వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తో పాటు ఆలయంలో నిద్రిస్తున్న మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతులు శేఖర్, నాగేంద్ర లను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

