Sat Dec 06 2025 01:54:43 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
స్థానికుల సమాచారంతో.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కేపీహెచ్ బీ కాలనీ వైపు వెళ్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా అతివేగంగా ముందుకు దూసుకెళ్లింది టిప్పర్. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 20 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read : భారీ హిమపాతం.. 22 మంది మృతి
స్థానికుల సమాచారంతో.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story

