Mon Mar 16 2026 23:21:28 GMT+0530 (India Standard Time)
Breaking : చేపల వేట కోసం రిజర్వాయర్ లోకి దిగి ముగ్గురు యువకుల గల్లంతు
చల్లబసాయపల్లె రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు

కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. చేపల వేట కోసం వెళ్లిన ఈ ముగ్గురు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. కోరం రిజర్వయార్ లో చేపలవేట చేద్దామని భావించిన ముగ్గురు యువకులు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన...
ఈ ముగ్గురు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించారు. వీరు విహార యాత్రకు అని వచ్చారని, అయితే చేపలవేట చేద్దామని రిజర్వాయర్ లోకి దిగిన వెంటనే కొట్టుకుపోయారని చెబుతున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకుని ముగ్గురి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

