Sun May 28 2023 09:54:26 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారిని చిదిమేసిన కారు
బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని కృష్ణనగర్ లో ఉంటున్నారు. హయత్ నగర్..

ఓ అపార్ట్ మెంట్ పార్కింగ్ ఏరియాలో నిద్రిస్తున్న చిన్నారిని ఓ కారు రూపంలో మృత్యువు పలుకరించింది. భవన నిర్మాణ కార్మికురాలైన తల్లి.. ఆ చిన్నారిని తాను పనిచేస్తున్న భవనానికి ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ పార్కింగ్ ఏరియాలో ఓ పక్కన పడుకోబెట్టి తన పనిలో నిమగ్నమైంది. ఆ అపార్ట్ మెంట్ లో ఉండే ఓ వ్యక్తి పార్కింగ్ ప్రాంతంలో పాప ఉందని గమనించకుండా కారును లోపలికి పోనిచ్చాడు. ఆ కారు టైరు పాప తలమీదుగా వెళ్లడంతో.. తల చిధ్రమై పాప మరణించింది. ఈ హృదయ విదారక ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా షాబాద్ కు చెందిన రాజు, కవిత దంపతులకు ఏడేళ్ల కొడుకు, మూడేళ్ల పాప ఉన్నారు. బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని కృష్ణనగర్ లో ఉంటున్నారు. హయత్ నగర్ సమీపంలోని లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన జరుగున్న భవననిర్మాణంలో శ్లాబు పనులు చేస్తున్నారు. బుధవారం పనులకు వెళ్తుండగా తమతోనే వచ్చిన మూడేళ్ల కూతురు లక్ష్మిని నీడ కోసం పక్కనే ఉన్న అపార్టుమెంట్ లోని పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టి.. తమ పనుల్లో నిగ్నమైంది తల్లి.
అదే అపార్టుమెంట్ లో ఉండే హరిరామకృష్ణ ఆ పాపను గమనించకుండా కారుతో అపార్ట్ మెంట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చారు. కారు ముందు చక్రం పాప తలపై నుండి వెళ్లడంతో.. తీవ్రగాయమై మరణించింది. బ్రతుకుతుందన్న ఆశతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే పాప మరణించిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story