Sun Apr 27 2025 09:42:11 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. చెరువులో ఈతకువెళ్లి ముగ్గురు మృతి
వారితో పాటు ఉన్న ఇతర విద్యార్థులు అక్కడున్న స్థానికులకు సమాచారం ఇచ్చారు. తమ స్నేహితులను కాపాడాలని..

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన దీపక్, పవన్, షాబాజ్ 9వ తరగతి చదువుతున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నానక్ రామ్ గూడ గోల్ఫ్ కోర్స్ పక్కనే ఉన్న చెరువులో దిగారు. ఈత కొడుతూ మరింత లోతుకు వెళ్లడంతో.. ప్రమాద వశాత్తు చెరువులో మునిగిపోయారు.
వారితో పాటు ఉన్న ఇతర విద్యార్థులు అక్కడున్న స్థానికులకు సమాచారం ఇచ్చారు. తమ స్నేహితులను కాపాడాలని కోరారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముగ్గురు విద్యార్థులు పూర్తిగా చెరువులో మునిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తీయించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. టెలికాం నగర్ లో విషాదం నెలకొంది. మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తయ్యాక కుటుంబాలకు అప్పగించనున్నారు.
Next Story