Sat Mar 07 2026 21:00:41 GMT+0530 (India Standard Time)
విషాదం.. బొగ్గుగనిలో ముగ్గురి మృతి
సింగరేణి బొగ్గు గని కూలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. రామగుండం బొగ్గు గనిలో జరిగిన ఈ ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

సింగరేణి బొగ్గు గని కూలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. రామగుండం బొగ్గు గనిలో జరిగిన ఈ ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందారు. వీరి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసిింది.
40 గంటల రెస్క్యూ ఆపరేషన్...
దాదాపు నలభై గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. బొగ్గు గని కూలడంతో కార్మికులు గనిలో చిక్కుకుపోయారని తెలిసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ముగ్గురు మాత్రం ఊపిరాడక గనిలోనే మరణించారని అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story

